పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాలేజీ శానిటేషన్ సెక్యూరిటీ కార్మికుల ధర్న.

పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాలేజీ శానిటేషన్ సెక్యూరిటీ కార్మికుల ధర్న. ప్రతి నెల 5వ తేదీ వేతనాలు చెల్లించాలి. వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటాం. సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17): నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతి నెల 5వ తేదీ వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్యం నశించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం...