బల్మూరు మండల బిజెపి మోర్చా మండల కమిటీ నియామకం.
బల్మూరు మండల బిజెపి మోర్చా మండల కమిటీ నియామకం. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 17): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండల కేంద్రంలోని ఉపసర్పంచ్ సీతారాం రెడ్డి నివాసంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ బలమూరు మండలంలోని వివిధ మోర్చాల మండల కమిటీలను నియమించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో మోర్చాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన మోర్చా అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా...