మద్దుట్ల గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి!

మద్దుట్ల గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి! డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రయోజనాలు మద్దుట్ల ప్రజలకు అందించాలి జగిత్యాల జిల్లా, నవంబర్ 17  (మల్యాల): ప్రతినిధి - బొమ్మెన రఘు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో, మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రాకపోకల కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఆటో చార్జీలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా...