పత్తి కొనుగోలులో మోసం.
పత్తి కొనుగోలులో మోసం. రైతులను నిలువునా ముంచుతున్న దళారులు. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 17): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో పత్తి రైతులను ఉప్పునుంతల మండలం ఈరుటోని పల్లి గ్రామానికి చెందిన పత్తి రాజేష్ అనే వ్యాపారి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తూ రిమోట్ ద్వారా కాంత తూకం వేసి క్వింటాల్ పత్తిలో 40 కిలో అదనంగా మోసగిస్తూ రైతుల నుంచి దండుకుంటున్నాడు. గ్రామంలో దాదాపు రైతుల వద్ద 270 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశాడని రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు రైతుల నుంచి అదనంగా 70 క్వింటాళ్ల పత్తిని సొమ్ము...