రాష్ట్రవ్యాప్తంగా 240 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటు..దుబ్బాక నియోజకవర్గానికి రెండు నూతన సహకార సంఘాలు. -అక్బర్‌పేట-భూంపల్లి, రాయపోల్ మండలాల్లో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు కృషి చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు – పాతూరి వెంకటస్వామి గౌడ్.

దుబ్బాక:నవంబర్18,(తెలంగాణ కెరటం)తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 240 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, మంత్రివర్యులకు, తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్‌పేట-భూంపల్లి, రాయపోల్ మండలాల్లో నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొని కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.రైతులకు సహకార సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, వ్యవసాయ రంగానికి అవసరమైన సేవలు సులభంగా అందించేందుకు నూతన పీఏసీఎస్‌ల ఏర్పాటు దోహదపడుతుందని, ఈ నిర్ణయం...