*భారత వంశక్రమం

ముఖ్యమైన పాయింట్స్:*భారత వంశక్రమం *భారత వంశక్రమం:* దుష్యంతుడి తండ్రి పేరు ఇలినుడు (ఇలినా/సంతురోధ) మరియు తల్లి పేరు రథంతరి (ఉపాదనవి).శకుంతల_దుష్యంతులకు పుట్టినవాడు భరతుడు.భరతుడికి సునందవలన భూమన్యుడు పుట్టాడు.భూమన్యుడికి విజయవలన సుహోత్రుడు జన్మించాడు.సుహోత్రుడికి సువర్ణ వలన హస్తి అనేవాడు పుట్టాడు. *ఇతడి పేరు మీదుగానే కౌరవుల రాజధాని హస్తినాపురమనే నగరం వెలిసింది.*హస్తికి యశోధర వలన వికుంఠనుడు పుట్టాడు.వికుంఠనుడకి వాసుదేవాయందు అజమీడుడు జన్మించాడు.అజమీడుడు కైకేయి, గాంధారి, ఋక్ష అనే ముగ్గుర్ని వివాహమాడాడు. వీరికి ముగ్గురికీ 124 మంది పుత్రులు కలికి వివిధ రాజ్యాలేలారు. వారందరిలో సంవరణుడు శ్రేష్టుడు.సంవరణుడు సూర్యుని పుత్రిక అయిన తపతి ని వివాహమాడాడు. వారికి కురుడు అనే శ్రేష్ఠమైన పుత్రుడు పుట్టాడు. అతని పేరుమీదనే కురుక్షేత్రమనే...