మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి రూ.3,000 జరిమానా.. ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్
*మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి రూ.3,000 జరిమానా.. ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్*....... *మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్*........తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....మంచిర్యాల... మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ అనలైజర్ పరీక్షలో 347 రీడింగ్ నమోదైన కుమ్మరి సురేష్‌ను ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసును విచారించిన మంచిర్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్ బుధవారం నిందితుడికి రూ.3,000 జరిమానా విధించడంతో పాటు, ఒకరోజు పాటు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.ఈరోజు 8 డ్రంక్ అండ్ డ్రైవ్ (DD)...