ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ పిలుపు తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా చేపడుతున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,...