పోలీస్‌స్టేషన్‌ సందర్శనతో విద్యార్థులకు చట్టాలపై అవగాహన

పోలీస్‌స్టేషన్‌ సందర్శనతో విద్యార్థులకు చట్టాలపై అవగాహన తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల పట్ల అప్రమత్తత కల్పించాలనే ఉద్దేశంతో భీమారం సిద్ధార్థ హై స్కూల్‌ విద్యార్థులు బుధవారం మెడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మెదిపల్లి ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌ పనితీరును విద్యార్థులకు వివరించారు. నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు ఫిర్యాదు చేసే విధానం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ, సీజ్‌ చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంతో పాటు ఇతర చట్టాల గురించి వివరించి, విద్యార్థులు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు ఎస్‌ఐ...