పునరావాసంలో భాగంగా తాటిగుండాల చెంచులకు ఇళ్ల పట్టాల పంపిణీ.
పునరావాసంలో భాగంగా తాటిగుండాల చెంచులకు ఇళ్ల పట్టాల పంపిణీ. 9 గిరిజన కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాల కేటాయింపు. పట్టా డాక్యుమెంట్లను అందజేసిన అమ్రాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేశం. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 18): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంఅమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల పునరావాస ప్రక్రియలో భాగంగా బుధవారం అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తాటిగుండాల చెంచుపెంట గిరిజన వాసులకు అటవీ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.తాటిగుండాల చెంచుపెంటకు చెందిన మొత్తం 15 చెంచు కుటుంబాలు పునరావాసం కోసం దరఖాస్తు చేసుకోగా, నిబంధనల ప్రకారం...