నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి

నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి బుజరంపేటలో గ్రామసభ.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరి కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 18  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజరంపేట గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో కృష్ణ, ఏ పీ ఓ పుణ్యదాస్ హాజరై ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు, నీటి సంరక్షణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని...