10+2 విద్యా విధానంపై వెంటనే స్పష్టమైన G.O. జారీ చేయాలి....
ఇంటర్ కళాశాలలకు 9, 10 తరగతుల అనుమతిని విరమించుకోవాలి.... ప్రైవేట్ పాఠశాలలకు 11, 12 తరగతులు నిర్వహించే అవకాశం కల్పించాలి..... బడ్జెట్ పాఠశాలల మనుగడను దెబ్బతీయొద్దు: ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు.తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....మంచిర్యాల..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10+2 విద్యా విధానాన్ని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రాస్మా) స్వాగతిస్తోందని సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు. అయితే ఈ విధానం అమలు పేరుతో ఇంటర్మీడియట్ కళాశాలలకు 9, 10 తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన కోరారు.పదో తరగతి అనంతరం వివిధ...