ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు రూ. 50 వేలు డిమాండ్!
రూ. 5 వేలు ఫోన్‌పే చేసినా ఇల్లు రాలేదని బాధితుడి ఆవేదనఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు.. సమగ్ర విచారణకు డిమాండ్కారేపల్లి, మన తెలంగాణ కెరటం:పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని రూ. 50 వేలు డిమాండ్ చేయగా, రూ. 5 వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించినప్పటికీ తనకు ఇల్లు మంజూరు కాలేదని చిన్నమడంపల్లి పంచాయతీ పరిధిలోని మోకాళ్ల రామయ్య గుంపునకు చెందిన మోకాళ్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవినీతి వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం...