విబిజీ రాంజీ పథకంపై మేట్లకు శిక్షణ కార్యక్రమం

విబిజీ రాంజీ పథకంపై మేట్లకు శిక్షణ కార్యక్రమం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : కోరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకానికి సంబంధించి మేట్లకు విబిజీ రాంజీ పథకంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వోదెల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో మేట్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. నూతనంగా అమలులోకి వస్తున్న విబిజీ రాంజీ పథకంలోని నిబంధనలు, విధివిధానాలు, మేట్ల బాధ్యతలు, విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మేట్లు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, ప్రతి కూలీకి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల...