మోత్కరావుపేట కు నూతన సబ్ స్టేషన్ మంజూరు
మోత్కరావుపేట కు నూతన సబ్ స్టేషన్ మంజూరు 03 కోట్ల 30 లక్షలతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అనుమతులు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలం మోత్కరావుపేట గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడిసిఎల్ ) పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. మొత్తం రూ.03 కోట్ల 30 లక్షల 18 వేల అంచనా వ్యయంతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.భీమారం మండలం మోత్కరావుపేట గ్రామంతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో...