నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్19.వనపర్తి మండలం అంకుర్ గ్రామానికి చెందిన రాకాసి నవీన్ కుమార్ రెడ్డి గారి నూతన గృహప్రవేశ వేడుక నిన్న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారి నూతన గృహానికి వెళ్లి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో వారి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, మాజీ గ్రంధాలయం చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కే మాణిక్యం, వేణు రెడ్డి,రవి ప్రకాష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి,మన్నెపు రెడ్డి,వినోద్,శ్రీనివారెడ్డి,పవన్ కుమార్ రెడ్డి,మల్లేష్,రాములు,నాయకులు,చిట్యాల రము,మజీ ఎంపీటీసీ,రంగారెడ్డి,హరిజన్ బుచ్చన్న,బోయ రాములు గ్రామ పెద్దలు,బంధుమిత్రులు,నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.