ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్ *గ్రామాలు, వార్డుల వారీగా ప్రత్యేక నమోదు శిబిరాల ఏర్పాటు ఈ నెల 20 నుంచి వివరాల నమోదు ప్రారంభం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్సంగారెడ్డి, నవంబర్ 19:-- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన కుటుంబాల వివరాలను నూతన విధివిధానాల ప్రకారం ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.గురువారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు...