నిరుపేద విద్యార్థులకు అండగా ఎన్ఎన్ వెల్ఫేర్ సొసైటీ

మదర్సా విద్యార్థులకు చాలీ దుస్తుల పంపిణీ..తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : నిరుపేద కుటుంబాలకు చెందిన మదర్సా విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎన్ఎన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు చాలీ దుస్తులు పంపిణీ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త అహ్మద్ అబ్దుల్ నయీమ్, జామే మసీదు కమిటీ అధ్యక్షుడు ఎం.డి మసీఉద్దీన్ లతో కలిసి విద్యార్థులకు దుస్తులను అందజేశారు. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు....