2,వ వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి

మున్సిపల్ కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి పత్రం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : జగిత్యాల పట్టణంలోని 02,వ వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిజెపి నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..02,వ వార్డులో గత కొంతకాలంగా మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలు క్రమం తప్పకుండా రావడం లేదని, దీంతో వార్డు ప్రజలు తమ ఇళ్లలో పేరుకుపోతున్న చెత్తను ఎక్కడ వేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం వల్ల వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఈగలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే...