అచ్చంపేటలో రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడి మృతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గురువారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొండూరు గురువయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.