మునగాల పెన్షన్ పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘన వార్డు మెంబర్లకు దక్కని గౌరవం

తెలంగాణ కెరటం - సూర్యాపేట జిల్లా:మునగాల, నవంబర్ 19మునగాల పెన్షన్ పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘనవార్డు మెంబర్లకు దక్కని గౌరవం.. 7వ వార్డు మెంబర్ వి. వసంత కుమార్ ఆగ్రహంమునగాలలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పాటించకపోవడం పట్ల ఏడవ వార్డు మెంబర్ వి. వసంత కుమార్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ప్రజలచే ఎన్నుకోబడిన వార్డు మెంబర్లను, కనీసం మహిళా వార్డు మెంబర్లను కూడా వేదికపైకి ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రోటోకాల్ నిబంధనలను పట్టించుకోకుండా అన్నింటికీ తానే అన్నట్లు వేదికపైకి రావడం ప్రభుత్వ కార్యక్రమాన్ని అగౌరవపరచడమేనని మండిపడ్డారు. ఇదంతా జరుగుతున్నా అధికారులు, సర్పంచ్ పట్టించుకోకపోవడం మొత్తం గ్రామ...