అనురాగ్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు
యువతలో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యం (తెలంగాణ కెరటం): ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 19: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :- ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని వెంకటాపురంలో ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించిన వెస్ట్ జోన్ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరం–2026 ముగింపు వేడుకలు నవంబర్ 18న ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న వాలంటీర్లు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. నాగరాజు, గౌరవ అతిథులుగా అనురాగ్ యూనివర్సిటీ ట్రస్టీ అనురాగ్ పల్లా, ఉపకులపతి డాక్టర్ అర్చనా మంత్రి,...