కొండగట్టు చందనోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు!
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భద్రతా చర్యలుబందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్జగిత్యాల జిల్లా: మల్యాల: ప్రతినిధి బి.రఘు _ కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల...