శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు తెలంగాణ కెరటం 19 నవంబర్ కామారెడ్డి  కామారెడ్డి జిల్లా కేంద్రం లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అనుగ్రహ భాషణంజిల్లా కేంద్రం లోని స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్ కామారెడ్డి లో గురువారం రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదని తెలిపారు. లక్ష్య సాధనలో హనుమంతున్ని ఆదర్శంగా తీసుకోవాలని ,సమయాన్ని వృధా చేయకూడదని తెలిపారు. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించ కూడదని...