పుట్టినరోజు వేడుకలు కాదు… మనం చేసే మంచి పనులే శాశ్వత జ్ఞాపకాలు!
జన్మదిన శుభాకాంక్షల వెనుక ఒక గొప్ప జీవిత సందేశం ఉండాలి! తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 19 :ప్రతి సంవత్సరం మన జన్మదినం రాగానే ఎంతో ఆనందంగా, సంతోషంగా కేకులు కట్ చేస్తూ, పూలమాలలు వేసుకుంటూ, శాలువాలతోసత్కరించుకుంటూ,స్నేహితులు, బంధువుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ వేడుకలు జరుపుకుంటాం.కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరో సంవత్సరం మన జీవితంలో గడిచిపోయింది. మన జీవితకాలం నుంచి ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఈ గడిచిన సంవత్సరంలో సమాజానికి మనం చేసిన మంచి పని ఏమిటి? పేదవారికి అందించిన సహాయం ఏమిటి? విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన కృషి ఏమిటి? ఆపదలో ఉన్నవారికి అందించిన అండ ఏమిటి?మనిషి పుట్టినరోజు జరుపుకోవడం...