చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు అన్యాయం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన నూతన చేయూత పెన్షన్లలో చేనెత కార్మికులకు ఆన్యాయం జరిగిందని భీమారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు అన్నం రాజేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము దరఖాస్తు చేసిన వాటిలో చాలా దరఖాస్తులు తిరస్కరణ అయ్యాయని, తాము ఆర్థికంగా, సామాజికంగా, వెనుక బడ్డామని, తమకు ఎలాంటి భూములు గాని, ఆస్తులు గాని లేవని అన్నారు. తాము గతంలో ముంబాయి, భీవండి, సిరిసిల్లలో ప్రాంతాల్లో నేత కార్మకులుగా చేసినప్పటికి, తన ధరఖాస్తలను తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి. చేనేత శాఖ మంత్రి చొరవ తీసుకుని, తమ ధరఖాస్తలను తిరిగి...