వనపర్తి 8వ వార్డులో కనీస వసతుల కొరత
వనపర్తి 8వ వార్డులో కనీస వసతుల కొరతతెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్19 వనపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు చంద్రయనగుట్టలో ప్రజలు కనీస వసతులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేవని పరిసరాలు చెత్త చెదారంతో దుర్వాసన వస్తున్నాయని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులకు పలుమార్లు సమస్యల గురించి తెలిపిన పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాలేదని వాపోతున్నారు.