ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనిమన్యసీమ పరిరక్షణ సమితి – డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య.ములుగు జిల్లా బ్యూరో (తెలంగాణ కెరటం) నవంబర్ 19:భద్రాచలం లాడ్జి వద్ద ఆదివాసి యువకుడు తెల్లం శరత్ హత్యకు గురైన ఘటనను మన్యసీమ పరిరక్షణ సమితి – డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసి యువకుడు తెల్లం శరత్ హత్యకు కారణమైన నిందితులను, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే, విచారణలో ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం (ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం) వర్తించే అంశాలు...