బస్సు ఎక్కుతుండగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి
బస్సు ఎక్కుతుండగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : కోరుట్ల బస్టాండ్ లో బుధవారం రోజు సాయంత్రం బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని లక్ష్య హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్య అనే విద్యార్థిని కోరుట్లలోని మాస్ట్రో కళాశాలలో ఇంటర్ చదువుతోంది. బుధవారం సాయంత్రం కోరుట్ల-బొమ్మెన బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బస్సు కదలడంతో అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె కుడి కాలుకు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న...