సంక్షేమ హాస్టళ్లలో నాణ్యత లేని భోజనం అందిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి!!

తెలంగాణ కెరటం నిర్మల్ జిల్లా ప్రతినిధిలక్ష్మణ్ అడ్వకేట్ జగన్ మోహన్బీ ఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ తీవ్రంగా విమర్శించారు.కొన్ని హాస్టళ్లలో పురుగులు ఉన్న అన్నం, కుళ్లిన కూరగాయలు, నాణ్యత లేని ఆహారం, కలుషితమైన తాగునీరు అందుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునేది పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే కాబట్టి...