గ్యాంగుల పేరుతో హల్చల్ చేస్తే కఠిన చర్యలు
గ్యాంగుల పేరుతో హల్చల్ చేస్తే కఠిన చర్యలు ఇన్స్పెక్టర్ ఎండీ.సాధిక్ పాషా ‘చంటి భాయ్ గ్యాంగ్’ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్న వారిపై కేసుల నమోదు చేసినట్లు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సాబీర్ పాషా తెలిపారు. ‘చంటి భాయ్ గ్యాంగ్’ అంటూ గ్రూపులుగా ఏర్పడి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు, వీడియోలు పెడుతున్న నగరంలోని శుక్రవారపుపేట చెందిన మహ్మద్ వజీద్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని గ్యాంగుల పేరుతో హడావుడి చేయడం, బెదిరింపులకు...