వరంగల్లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు!
మహిళ ఇంటిపై బుల్డోజర్.. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత!అధికారులతో కుమ్మక్కై తన ఇంటిని కూల్చివేయించారని బాధితురాలి ఆరోపణ..న్యాయం చేయాలని వేడుకోలు!వరంగల్ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 20వరంగల్ నగరంలో భూముల విలువ పెరుగుతుండటంతో భూకబ్జాదారుల ఆగడాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన భూములపై కన్నేస్తున్న కొందరు వ్యక్తులు సామాన్యుల ఆస్తులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా న్యూ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకున్న ఓ మహిళ ఇంటిని కూల్చివేత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో నిర్మించుకున్న తన ఇంటిని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది శుక్రవారం ఉదయం కూల్చివేశారని బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. కనీసం తనకు...