37వ డివిజన్ పెంటగడ్డ బజార్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలి

37వ డివిజన్ పెంటగడ్డ బజార్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలి ఇళ్లకు నష్టం కలగకుండా రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టాలి బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా ఖమ్మం, నవంబర్ 20 (తెలంగాణ కెరటం): ఖమ్మం: ఖమ్మం నగరంలోని 37వ డివిజన్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఖిల్లా ఎంట్రన్స్ వరకు ఉన్న పెంటగడ్డ బజార్ రోడ్డును 40 అడుగుల మేర విస్తరించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యకి 37వ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ వీరవెల్లి మిత్రవింద రాజేష్ గుప్తా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఇళ్లకు నష్టం కలగకుండా, ఇప్పటికే చేపట్టిన డ్రైనేజీ పనులను పూర్తి...