సిరికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు.. సింగిల్ విండో చైర్మన్ ముబీన్  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సిరికొండ సింగిల్ విండో చైర్మన్ ముబీన్ సూచించారు. కథలాపూర్ మండలం సిరికొండలో ఏర్పాటు చేసిన ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఎండీ ముబీన్ శుక్రవారం ఏఎంసీ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ ముదాం రవిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముబీన్ మాట్లాడుతూ..రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు...