జిల్లా సంగీత వాయిద్యాల పోటీలో పోతారం విద్యార్థికి ద్వితీయ స్థానం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జగిత్యాల డీసీఈబి వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి పీఎంశ్రీ పాఠశాలల కళా సాంస్కృతిక పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో కథలాపూర్ మండలానికి చెందిన పీఎంశ్రీ ఎంపిపిఎస్ పోతారం పాఠశాల విద్యార్థి అన్నారపు రిత్విక్ అద్భుత ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో సంగీత వాయిద్య పరికరాల సాధనలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలలో పోతారం పాఠశాల తరఫున ప్రతిభ చాటిన విద్యార్థి అన్నారపు రిత్విక్ జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటాడు. ఈ విద్యార్థులను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గైడ్ టీచర్...