కాళ్లు మొక్కించుకునే సంస్కృతి నాది కాదు కాళ్లు మొక్కించుకున్న దొరల అహంకారాన్ని తరిమికొట్టిన సంస్కృతి నాది!
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఘాటు వాక్యాలుతెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20:కాళ్లు మొక్కించుకునే సంస్కృతి నాది కాదు.. కాళ్లు మొక్కించుకున్న దొరల అహంకారాన్ని తరిమికొట్టిన సంస్కృతి నాది అని జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల కేంద్రంలో నిర్వహించిన నూతన పెన్షన్ల మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు.ప్రశాంత్ రెడ్డి.. నన్ను సిగ్గులేదా అని అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది?ఆదివాసీ గిరిజన తెగలో పుట్టి, ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో...