కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగా భూమి వద్ద పనులెలా చేపడతారు?
సర్వే నంబర్ 83లోని భూమిపై యథాతథ స్థితి కొనసాగించాలని బాధితుల డిమాండ్ కోర్టు కేసు పెండింగ్లో ఉండగానే భూమి వద్ద పనులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ తమ భూమికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 20: కోర్టులో భూ వివాదం కేసు పెండింగ్లో ఉండటంతో పాటు, యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వివాదాస్పద భూమి వద్ద పనులు చేపట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ముత్వేల్లిగూడ గ్రామానికి చెందిన అందే శ్రీశైలం, మట్ట విష్ణు గౌడ్ ఆరోపించారు. తమ తాతముత్తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ...