యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరించాలి

యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరించాలి – రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన.. నాయకుల అరెస్ట్ (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 20: తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం, కొన్ని ఖాతాలను నిషేధించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ గొంతుకను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఖాతాలను నిలిపివేస్తున్నారని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత...