భువనగిరిలో ఘనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవం

భువనగిరిలో ఘనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవం భువనగిరి: భువనగిరి పట్టణంలోని 18, 35, 6, 7 వార్డులకు సంబంధించి నెహ్రూ కెన్నెడీ పార్కులో ఇందిరమ్మ జీవిత బీమా పథక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు హాజరై పథకాన్ని ప్రారంభించారు. వారితో పాటు భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా...