శాలిగౌరారం* మండల కేంద్రంలో నిర్వహించిన *నూతన చేయూత పింఛన్ల మంజూరు* ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం
*శాలిగౌరారం* మండల కేంద్రంలో నిర్వహించిన *నూతన చేయూత పింఛన్ల మంజూరు* ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం మరియు *ఎల్నినో (El Niño) ప్రభావంపై* నిర్వహించిన సమీక్షా సమావేశంలో *తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామేలు* గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాను. నూతన చేయూత పింఛన్ల మంజూరు ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపాను. అలాగే, ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించాను....