ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.జైపూర్..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న  దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మండల తహసిల్దార్ వనజా రెడ్డితో కలిసి పరిశీలించి ఇప్పటివరకు అందిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా...