రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బాదినేని రాజేందర్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బాదినేని రాజేందర్ జగిత్యాల జిల్లా: దొంతాపూర్ గ్రామంలో మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ధర్మపురి మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో చైర్మన్, బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాదినేని రాజేందర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు. రైతుల...