నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్*
*నవగ్రహ ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్*తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ సంగారెడ్డి పట్టణ శివారులోని గేట్వే మ్యానర్స్ వద్ద నూతనంగా నిర్మించిన నవగ్రహf ఆంజనేయ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మహోత్సవానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా...