పొన్కల్ లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

మామడ మండలం పొనకల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మత్స్యకారుల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షులు పొట్టేల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనాధారమైన చెరువుల పరిరక్షణతో పాటు గంగపుత్రుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రవి, క్యాషియర్ రమేశ్‌తో పాటు పలువురు గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.