యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల కొత్తగూడెం పట్టణంలోని రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబర్ 21 (తెలంగాణ కెరటం ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 200 ఇళ్లను, 82 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 21 వాహనాలపై జరిమానాలు విధించారు. మొత్తం 151 చలాన్ల...