అయ్యప్ప స్వామి పూజలో పాల్గొన్న అచ్చంపేట ఏమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజా భవన్ ఏమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం అయ్యప్ప స్వాములు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప నామస్మరణలో ఆధ్యాత్మిక ఆనందం… స్వాముల శరణుఘోషలో భక్తి పరవశం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, మణికంఠుని దివ్య ఆశీస్సులు నల్లమల ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నానని తెలిపారు.