మద్యం మత్తులో కారు నడిపి ఆటోను గుద్దిన డ్రైవర్ 10 మందికి గాయాలు

తెలంగాణ కెరటంనవంబర్ 21సూర్యాపేట జిల్లా మునగాల:ప్రతినిధి: సీహెచ్. నవీన్మద్యం మత్తులో కారు నడిపి ఆటోను గుద్దిన డ్రైవర్  10 మందికి గాయాలుతిరుమలగిరి వద్ద రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు (నం. TS 29 L 3946) బలంగా ఢీకొట్టింది. కారు డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉండగా, వారందరికీ గాయాలయ్యాయి. కారు బలంగా గుద్దిన ధాటికి దాని ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో వెనుక మరియు పక్క భాగాలు తీవ్రంగా...