దళిత పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి అమానుషం నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలి!

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ ఖండన. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై బాలకృష్ణ అనే వ్యక్తి కులం పేరుతో దూషిస్తూ, సెంట్రింగ్ కర్రతో కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ తీవ్రంగా ఖండించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం పారిశుద్ధ్య...