అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రకు ఎన్వీఆర్ ఆత్మీయ కానుక

11 వేల ఆర్థిక సహాయం అందజేసిన నల్ల వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ కెరటం మామడ ఎలిగేటి వంశీకృష్ణ నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి శబరిమల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. జి. శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న స్వాములను జిల్లా బీఆర్ఎస్ నాయకుడు నల్ల వినయ్ కుమార్ రెడ్డి ఆత్మీయంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల పాదయాత్రకు తన వంతు సహకారంగా ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.11,000 నగదును అందజేశారు. అయ్యప్ప స్వాముల సేవలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా...