నూతన గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ.
కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవదారికుంట తాండ నూతన గ్రామపంచాయతీ కి రూ. 20 లక్షల వీబీజీ రామ్ జీ నిధులతో నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనానికి శనివారం భూమి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మూణావత్ మంగమ్మ రతన్ సింగ్, పిఆర్ ఏఈ మహేష్ , గ్రామ కార్యదర్శి చందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులు పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ...